35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ గుండెపోటుతో మరణం.. 23 d ago
తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఒక క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ బ్యాటింగ్ చేస్తున్న ఆయన నిర్జీవంగా మారడంతో సహచరులంతా బాధలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన అనంతరం అతడు డగౌట్ కి వెళ్తుండగా కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు, ప్రేక్షకులు హడలెత్తిపోయారు.